సోనా కామ్‌స్టార్... ‘రేస్’లోకొచ్చింది...

ABN , First Publish Date - 2021-06-25T01:42:12+05:30 IST

సోనా కామ్‌స్టార్ ఐపీఓకు వచ్చిన స్పందనను చూసి లిస్టింగ్ రోజు పెద్దగా లాభాలుండవేమో అనే అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి.

సోనా కామ్‌స్టార్... ‘రేస్’లోకొచ్చింది...

గురుగావ్ : సోనా కామ్‌స్టార్ ఐపీఓకు వచ్చిన స్పందనను  చూసి లిస్టింగ్ రోజు పెద్దగా లాభాలుండవేమో అనే అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి.దానికి తోడు లిస్టింగ్ కూడా 4 శాతం మాత్రమే ఎక్కువగా ఉండటంతో..మొదటి పావుగంటలో సోనాకామ్ స్టార్ ఫోర్జింగ్స్ ఐపీఓను చూసి చతికిలబడిన వారు...  ఆ వెంటనే అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఏకంగా పాతిక శాతానికిపైగా ఎగబాకిందీ షేరు. 


ఇష్యూ ప్రైస్ రూ. 291 కాగా, రూ. 302 వద్ద ప్రారంభమైన సోనాకామ్ స్టార్ ఐపీఓ ఆ తర్వాత టేకాఫ్ తీసుకుంది ఏకంగా ఇంట్రాడేలో రూ. 362.85 ధరకి చేరింది.అంటే పాతికశాతం పెరిగింది. మరోవైపు ఇదే సమయంలో లిస్టైన శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ కూడా ఇదే స్థాయిలో లాభం పంచడంతో రెండు ఇష్యూలకు దదరఖాస్తు చేసి అలాట్ అయినవారు హ్యాపీ. రూ. 5550 కోట్ల నిధులు సమీకరించడం కోసం ఇష్యూకొచ్చిన సోనా కామ్‌స్టార్...  ఆటోఎక్విప్‌మెంట్, ప్రిసిషన్ ఇంజనీరింగ్ ఎక్విప్‌మెంట్,ఫోర్జింగ్స్ సెక్టార్లను నిర్వహిస్తోంది. 

Updated Date - 2021-06-25T01:42:12+05:30 IST