Salman Khan ఇంటికి కోడలిగా వెళ్లబోతున్న సోనాక్షి సిన్హా..?

బాలీవుడ్‌లో ఒకరి తర్వాత మరొకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే అనుష్క రంజన్-ఆదిత్య సీల్, రాజ్ కుమార్ రావ్-పత్ర‌లేఖ లు పెళ్లి చేసుకున్నారు. కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ డిసెంబర్ 9న రాజస్థాన్‌లో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. 2022 మొదట్లో ఆలియా భట్-రణ్ బీర్ కపూర్, అదర్ జైన్-తార సుతారియా కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరొకరు చేరబోతున్నారని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెవరో కాదు శత్రఘ్న సిన్హా కూతురైన సోనాక్షి సిన్హా. 


సల్మాన్ ఖాన్ ఇంటికి ఆమె కోడలిగా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. సెలెబ్రిటీల మెనేజరైన బంటి సచ్‌దేవ్‌ను ఆమె పెళ్లాడనున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గత కొంతకాలంగా బంటి సచ్‌దేవ్‌తో ఆమె డేటింగ్ చేస్తుందని సమాచారం. గతంలో సిరీయస్ రిలేషన్ షిప్‌ను కూడా వారు కొనసాగించారు. అనంతరం వారిద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో కొన్ని రోజులు ఆ బంధానికి బై బై చెప్పారు. తాజాగా ఆ పొరపొచ్చాలకు స్వస్తి పలుకుతూ వారు కొత్త బంధాన్ని ప్రారంభించబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమాతో సోనాక్షి సిన్హా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి దబాంగ్-2, దబాంగ్-3 చిత్రాల్లో నటించారు.   


బంటి సచ్ దేవ్ సల్మాన్‌కు సన్నిహిత మిత్రుడు. సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్‌కు సోదరుడు. సోహైల్ ఖాన్ సల్మాన్‌కు సోదరుడన్న సంగతి అందరికీ తెలిసిందే.

Advertisement

Bollywoodమరిన్ని...