May 14 2021 @ 22:06PM

‘గ్రాండ్మా’లో సోనీ అగర్వాల్.. ఫస్ట్ లుక్ విడుదల

హీరోయిన్‌ సోని అగర్వాల్‌ ప్రధాన పాత్రలో ఒక హారర్‌ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు సజిన్‌లాల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పేరు ‘గ్రాండ్మా’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటీమణులు మంజూ వారియర్‌, విమలా రామన్‌లతో పాటు మరికొందరు నటీనటులు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి పనిచేసే సాంకేతిక నిపుణులంతా మాలీవుడ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. ఇదిలావుంటే, గత యేడాది కోలీవుడ్‌లో చాలా తక్కువ హారర్‌ చిత్రాలు వచ్చాయి. ఈ లోటును భర్తీ చేసేలా ఈ యేడాది జనవరి నుంచి అనేక హారర్‌ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. అందులోనూ లేడీ ఓరియెంటెడ్‌ హారర్‌ చిత్రాలే అధికంగా వున్నాయి. ఆ కోవలో ఇప్పుడు ఈ ‘గ్రాండ్మా’ చిత్రం రానుంది.