Sonia Gandhi సందేశం : రాజకీయ ఏకాభిప్రాయం సాధించండి

ABN , First Publish Date - 2021-05-01T19:55:15+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు

Sonia Gandhi సందేశం : రాజకీయ ఏకాభిప్రాయం సాధించండి

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి శనివారం ఓ వీడియో సందేశం పంపించారు. ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కొనేందుకు జాతీయ విధానం కోసం రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మేలుకుని, తమ కర్తవ్యాలను నిర్వహించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. 


కోవిడ్-19 వ్యాక్సిన్లను ప్రజలందరికీ ఉచితంగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు కంపల్సరీ లైసెన్సింగ్‌ను వేగవంతం చేయాలన్నారు. జాతీయ విధానాన్ని రూపొందించి కోవిడ్-19పై పోరాడాలని, దీని కోసం రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని సాధించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు జాగృతమై, తమ కర్తవ్యాలను నిర్వహించవలసిన సమయం ఇదేనని తెలిపారు. 


ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడటం కోసం ప్రతి పేద కుటుంబానికి రూ.6,000 చొప్పున అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్ నిర్థరణ పరీక్షలను పెంచాలని, ప్రాణాలను కాపాడే ఔషధాల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. 


ఈ మహమ్మారిపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా కాంగ్రెస్ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ పరీక్షా కాలంలో ప్రజలందరూ సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-05-01T19:55:15+05:30 IST