Abn logo
Sep 28 2021 @ 16:36PM

సోనియా, రాహుల్ హుటాహుటిన ఢిల్లీకి..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీ మంగళవారం హిమచల్ ప్రదేశ్‌లోని సిమ్లా నుంచి ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఛండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. దీనికి కొద్ది సేపటి క్రితమే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం ఛండీగఢ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కెప్టెన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, తన సన్నిహితులను కలుసుకునేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని కెప్టెన్ మీడియా అడ్వయిజర్ వివరణ ఇచ్చారు. ఢిల్లీలో సోనియాగాంధీని ఆయన కలుసుకుంటారని కూడా చెబుతున్నారు. కాగా, సోనియాగాంధీ తన కుమార్తె ప్రియాంక వాద్రా ఉంటున్న సిమ్లాకు మూడు రోజుల క్రితం వెళ్లారు. ఇటు సోనియాగాంధీ, అటు కెప్టెన్ ఢిల్లీ బాటపట్టడం, ఇదే తరుణంలో పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇవి కూడా చదవండిImage Caption