మరోసారి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియా

ABN , First Publish Date - 2020-07-10T07:18:46+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీకి పొడిగింపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడిని నియమించిన ఏడాది వ్యవధిలో...

మరోసారి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియా

న్యూఢిల్లీ, జూలై 9: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీకి పొడిగింపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడిని నియమించిన ఏడాది వ్యవధిలో పూర్తి స్థాయి అధ్యక్షుడి ఎన్నిక జరగాలి. సోనియాగాంధీ పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగిసిపోతోంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగే వాతావరణం లేనందున ఆమెనే మరో ఏడాది కొనసాగిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు త్వరలో వర్కింగ్‌ కమిటీ సమావేశం కానుంది. అనంతరం ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి సమాచారమిస్తారు. కరోనా మహమ్మారి దేశమంతా ఆవహించిన నేపథ్యంలో పూర్తి స్థాయి అధ్యక్షుడి ఎన్నిక ఇప్పట్లో సాధ్యం కాదని ఈసీకి నివేదిస్తారు.  


Updated Date - 2020-07-10T07:18:46+05:30 IST