కొడుకులే కాడెద్దులుగా...

ABN , First Publish Date - 2021-01-18T04:06:05+05:30 IST

కాడెద్దులను కొనలేని స్థితిలో ఓనిరుపేద రైతు తన కన్నకొడుకులచేత గొర్రుతో కరిగెట చేస్తున్న దయనీయ స్థితి ఇది.

కొడుకులే కాడెద్దులుగా...
దోరేపల్లిలో కొడుకులను కాడెద్దులుగా కరిగెట కడుతున్న రైతు

మద్దూర్‌, జనవరి 17 : కాడెద్దులను కొనలేని స్థితిలో ఓనిరుపేద రైతు తన కన్నకొడుకులచేత గొర్రుతో కరిగెట చేస్తున్న దయనీయ స్థితి ఇది. మండలంలోని దోరేపల్లి శివారులో చోటుచేసుకుంది. దోరేపల్లిలో శివగారి పెద్ద రాములుకు రెండున్న ఎకరాల పొలం ఉంది. పదకొండ వ మారు వేసిన బోరులో నీళ్లు పడ్డాయి. అప్పులు అధి కం కావడంతో సాగుకోసం కాడెద్దులు కొనలేని స్థితి. నీటి సౌకర్యం ఉన్నందున ఎలాగైనా సాగు చేయాలని ఆలో చించి తన కొడుకుల చేత గొర్రును లాగిస్తూ కరిగెట చే యిస్తున్నాడు. ఇలాంటి నిరుపేద రైతులకే కదా ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సింది.

Updated Date - 2021-01-18T04:06:05+05:30 IST