May 8 2021 @ 10:34AM

చిన్నారి మృతిపై సోనూసూద్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

కొవిడ్ స‌మ‌యంలో ఎంతో మందికి ఆప‌న్న హ‌స్తం అందిస్తోన్న బాలీవుడ్ న‌టుడు సోనూసూద్..చిన్నారి భారతి మరణంపై స్పందిస్తూ శ‌నివారం ఓ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ‘‘నాగపూర్‌కి చెందిన భార‌తి అనే యువ‌తిని నాగ‌పూర్ నుంచి హైద‌రాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. నెల రోజుల పాటు మృతువుతో పోరాటం చేసి శుక్ర‌వారం భార‌తి క‌న్నుమూసింది. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను. ఆమెను బ‌తికిస్తామ‌ని అనుకున్నాను. కానీ జీవితంలో ఏం జ‌రుగుతుందో ఊహించ‌లేం. నా హృదయం ముక్క‌లైంది’’ అని ట్వీట్‌లో తెలిపారు సోనూసూద్‌. క‌రోనా బారిన ప‌డిన భార‌తిని మెరుగైన చికిత్స కోసం ఎక్మో చికిత్స కోసం హైద‌రాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ను తీసుకొచ్చారు.