Abn logo
Jul 14 2020 @ 00:38AM

మరో 400 కుటుంబాలకు అండగా...

సోనూసూద్‌ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభంతో నిరాశ్రయులైన  ఎంతోమంది కార్మికులను ఆయన ఆదుకున్నారు. బస్సు, రైలు, విమాన మార్గంలో వలస కార్మికులను సొంత గూటికి చేర్చారు. ఇప్పుడు మరోసారి వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు సోనూ ముందుకొచ్చారు. లాక్‌డౌన్‌ వల్ల వందల కిలోమీటర్లు నడిచి గాయపడి, మరణించిన 400లకు పైగా వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి  సోనూసూద్‌ సిద్ధమయ్యారు.  ఇబ్బందుల్లో ఉన్నవారికి మద్దతుగా నిలవడం బాధ్యతగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా వివిధ రాష్ర్టాల అధికారులతో మాట్లాడి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, వారికి సంబంధించిన సమాచారం చిరునామాలు, బ్యాంక్‌ వివరాలను తీసుకున్నారు. వారందరికీ ఆర్థికంగా అండగా ఉంటానని సోమవారం సోనూ ప్రకటించారు.  


Advertisement
Advertisement
Advertisement