Abn logo
Jul 13 2020 @ 23:24PM

మరోసారి పెద్ద మనసు చాటుకున్న సోనూసుద్

ప్రముఖ నటుడు సోనూసుద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. లాక్‌డౌన్ వల్ల ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను తన సొంత డబ్బుతో బస్సులు పెట్టి మరీ వారి స్వస్థలాలకు తరలించిన సోనూసుద్ మరోసారి వలస కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా.. స్వస్థలాలకు వెళ్లే సందర్భంలో ప్రాణాలు కోల్పోయి, గాయపడిన 400 వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు సోనూసుద్ ముందుకొచ్చాడు. సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను ఓ న్యూస్ ఏజెన్సీకి సోనూసుద్ వెల్లడించాడు.


లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, సొంత రాష్ట్రాలకు వెళుతూ ప్రమాదాల కారణంగానో, ఇతర కారణాల వల్లనో ప్రాణాలు కోల్పోయి, గాయపడిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని తాను నిర్ణయించుకున్నట్లు సోనూసుద్ చెప్పాడు. ఆ కుటుంబాలకు భరోసాతో కూడిన భవిష్యత్‌ను అందివ్వాలన్నదే తన అభిమతంగా తెలిపాడు. వారికి అండగా నిలవడం తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పాడు.


ఇదిలా ఉంటే.. సోనూసుద్ ఇప్పటికే వారికి సాయం చేసే ప్రక్రియను మొదలుపెట్టాడు. ఆయా రాష్ట్రాల అథారిటీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి మరణించిన, గాయపడిన వారి కుటుంబాల చిరునామాలను, ఆ కుటుంబాల బ్యాంకు అకౌంట్ వివరాలను సోనూసుద్ అడిగి తెలుసుకున్నాడు.

Advertisement
Advertisement
Advertisement