Abn logo
Jan 16 2021 @ 15:45PM

టైలర్‌గా మారిన సోనూసూద్‌.. రీజనేంటి?

కోవిడ్‌ ప్రభావ సమయంలో ఆపన్నులకు సాయం చేసి రియల్‌ హీరోగా మారిన సోనూసూద్‌ ఇప్పటికీ తన సహాయ కార్యక్రమాలను అందిస్తూనే ఉన్నాడు. సోషల్‌ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని తనకు వీలైన సాయాన్ని అందిస్తున్న రియల్‌ హీరో సోనూసూద్‌ ఇప్పుడు ఉన్నట్లుండి టైలర్‌గా మారాడు. షూటింగ్‌ సమయంలో దొరికిన గ్యాప్‌లో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఉపయోగించే టైలరింగ్‌ మిషన్‌పై బట్టలు కుట్టిన సోనూసూద్‌ ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అంతే కాదండోయ్‌ "సోనూసూద్‌ టైలర్‌ షాప్‌ ఇక్కడ ఉచితంగా బట్టలు కుట్టబడును. మీ ప్యాంట్‌ కాస్త నిక్కరుగా మారే అవకాశాలున్నాయి" అంటూ తమాషాగా తనపై తనే కామెంట్‌ చేసుకున్నాడు. 


Advertisement
Advertisement
Advertisement