కర్నూలు కుర్రాడిని అభినందించిన సోనూసూద్

ABN , First Publish Date - 2021-05-19T10:44:42+05:30 IST

కరోనా కాలంలో కష్టాలు పడుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తూ రియల్ హీరోగా నిలిచిన స్టార్ సోనూసూద్. ప్రస్తుతం దేశం మొత్తం అభిమానులు అధికంగా ఉన్న నటుడు ఈయనే అనడం అతిశయోక్తి కాదు.

కర్నూలు కుర్రాడిని అభినందించిన సోనూసూద్

ముంబై: కరోనా కాలంలో కష్టాలు పడుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తూ రియల్ హీరోగా నిలిచిన స్టార్ సోనూసూద్. ప్రస్తుతం దేశం మొత్తం అభిమానులు అధికంగా ఉన్న నటుడు ఈయనే అనడం అతిశయోక్తి కాదు. అలాంటి సోనూసూద్.. ఒక తెలుగు కుర్రాడిని ప్రశంసల్లో ముంచెత్తాడు. అతనే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన అఫ్రిది అనే యువకుడిని సోనూసూద్ ప్రశంసించాడు. ఇంతకీ అఫ్రిది ఏం చేశాడో తెలుసా? తన మూడు నెలల జీతాన్ని సూద్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చాడు. రైల్వే మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్న అఫ్రిది ఒక యాక్సిడెంటులో కాళ్లు పోగొట్టుకున్నాడు. అయినాసరే ఇతరులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో తన మూడు నెలల జీతాన్ని సూద్ ఫౌండేషన్‌కు పంపించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన సోనూసూద్.. ఇలాంటి హీరోలే ప్రపంచాన్ని మరింత మంచి ప్రదేశంగా మారుస్తారని పేర్కొన్నాడెు. అలాగే అఫ్రిది చేసిన సాయం ఒకరి జీవితంలో నవ్వులు పూయించేలా చేస్తానని హామీ ఇచ్చాడు.

Updated Date - 2021-05-19T10:44:42+05:30 IST