రైలు ప్రయాణికుల సేవకు ట్రైన్ హోస్టెస్‌లు

ABN , First Publish Date - 2021-12-10T18:21:18+05:30 IST

ప్రయాణికులకు భారతీయ రైల్వేలు సరికొత్త సేవలను

రైలు ప్రయాణికుల సేవకు ట్రైన్ హోస్టెస్‌లు

న్యూఢిల్లీ : ప్రయాణికులకు భారతీయ రైల్వేలు సరికొత్త సేవలను అందించబోతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో ట్రైన్ హోస్టెస్‌లను నియమించబోతున్నాయి. వీరు ప్రయాణికులకు స్వాగతం పలుకుతారు, ఆహారాన్ని సరఫరా చేస్తారు. ఫిర్యాదుల పరిష్కారానికి సహాయపడతారు. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్ళే రైళ్లలో ప్రస్తుతానికి వీరి సేవలు అందుబాటులో ఉండవు. 


ఆతిథ్యం, సేవా రంగాల్లో శిక్షణ పొందినవారిని ట్రైన్ హోస్టెస్‌లుగా నియమిస్తామని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైలు ప్రయాణం వల్ల కలిగే  అనుభూతిని ఆధునికం చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించామన్నారు. విమాన ప్రయాణికులకు లభించే సేవలతో పోటీ పడుతూ సేవలందించడంలో శిక్షణ పొందినవారిని  ట్రైన్ హోస్టెస్‌గా నియమిస్తామని చెప్పారు. వీరు పగటి వేళ మాత్రమే విధులు నిర్వహిస్తారని చెప్పారు. 


Updated Date - 2021-12-10T18:21:18+05:30 IST