జొన్న నగదు.. జమెప్పుడో.. ఐదు నెలలైనా అందని పైకం

ABN , First Publish Date - 2020-09-23T14:24:25+05:30 IST

బహిరంగ మార్కెట్లో కంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే మోస పోము అనుకున్న రైతులు..

జొన్న నగదు.. జమెప్పుడో.. ఐదు నెలలైనా అందని పైకం

అప్పులతో అల్లాడుతున్న రైతులు

రూ.65 కోట్ల వరకు మార్క్‌ఫెడ్‌ బకాయి   

డబ్బుల జమపై అధికారుల కుంటి సాకులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): జొన్న పంట విక్రయించాము.. ఖరీఫ్‌ పెట్టు బడికి దిగులు లేదు అనుకున్న రైతు అప్పులపాల య్యాడు. ఐదు నెలల క్రితం మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల్లో అష్ట కష్టాలు పడి అమ్మిన జొన్నల నగదు ఇంతవరకు జమ కా లేదు. అసలు ఆ నగదు ఎప్పుడు జమ చేస్తోరో చెప్పే వారే లేరు. కొందరి కి మాత్రమే వేశారు.. మా పరిస్థితి ఏమి టంటే కుంటి సాకులతో అధి కారులు తప్పించుకుం టున్నారు. జిల్లాలో 2,54,902 క్వింటా ళ్లకు సంబంధించి రూ.65 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉంది. ఈ నెల 18 లోపే రైతు ఖాతాల్లో నగదు వేస్తామని, ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని మార్క్‌ఫెడ్‌ ఎండీ ప్రద్యు మ్న ప్రకటించారు. అయితే   ఇంత వరకు అతీగతీలేదు. 


బహిరంగ మార్కెట్లో కంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే మోస పోము అనుకున్న రైతులు అల్లాడుతు న్నారు. గిట్టుబాటు దక్కుతుందని ఆశ పడిన రైతులు ఐదు నెలలుగా నిరాశలో ఉన్నారు. జిల్లాలో జొన్నలను ఐదు నెలల క్రితం మార్క్‌ఫెడ్‌కు విక్రయించారు. ఆ మొత్తం ఖరీఫ్‌ సాగుకు అందుతుం దని.. అప్పులు లేకుండా చేతికందుతా యని అనుకున్న రైతులకు అప్పులు తప్పలేదు. గడిచిన రబీలో పండించిన మొక్కజొన్న, జొన్న, కందు లు, శనగలను ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి మా ర్క్‌ఫెడ్‌, జీడీసీఎంఎస్‌ల ద్వారా కొనుగోలు చే యించింది. కొనుగోళ్ల సమయం లో రై తులకు అగ్నిపరీక్షలు తప్పలేదు. జిల్లాలో జొన్న రైతుల నుంచి మార్క్‌ఫెడ్‌ 98,500 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేసింది. దీనికి రూ.251.17కోట్ల మొత్తాన్ని రైతులకు చెల్లించాలి.


అయితే వీటిలో 2,54,902 క్వింటాళ్లకు రూ.65 కోట్ల వరకు ఐదు నెలల నుంచి జమ చేయ లేదు. ఏ రోజుకారోజు బ్యాంకు ఖాతాలో నగదు పడిందేమోనని చూసుకోవటం, అప్పుల వారికి సమాధానం చెప్పలేక ముఖం చాటేయటం తప్పడంలేదని జొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంపై రైతులు ప్ర శ్నిస్తే  ఖాతాలకు ఆధార్‌ లింక్‌ కాలేదని ఒకసారి, ఈ- క్రాప్‌లో నమోదు లేదని మరోసారి చెప్పి అధికారులు దాటవేస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఇలాంటి రైతులు సుమారు 2వేల మంది ఉన్నట్లు  సమాచారం. కుంటి సాకులు కాకుండా మార్క్‌ఫెడ్‌  రైతుల ఖాతాల్లో పంటల డబ్బు వేస్తే వారికి మేలు చేసినట్టే. కాని దీనిపై సమాధానం చెప్పేవారే లేరు. దీనిపై మార్క్‌ఫెడ్‌ డీఎం కె.రమేష్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో లేరు.


దళారులు నట్టేట ముంచారు..

అధికార పార్టీ అండ ఉండి, స్థానిక నాయకులు, కొనుగోలు కేంద్రాల సిబ్బందిలో కొందరికి డబ్బు చెల్లించుకున్న వారికి మాత్రమే జొన్నలను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే భాగ్యం దక్కింది. అయితే కొందరు కొనుగోలు కేంద్రాల బయటే రైతులను బయపెట్టి గిట్టుబాటు ధరకంటే తక్కువకు కొనుగోలు చేశారు. వాటిని తిరిగి రైతుల ముసుగులో కొనుగోలు కేంద్రాల్లో అమ్మేశారు. క్వింటా తెల్ల జొన్నల ధర రూ.2,550 ఉంటే, రైతు ల నుంచి దళారులు రూ.1800 నుంచి రూ.2100 వరకు అవకాశం ఉన్న ధరకు కొనేశారు. దళా రులను నమ్మి తక్కువకు అమ్ముకున్నా, వారికి డబ్బు అదీలేదు. రూ.1800 చొప్పున కొన్నవారు మాత్రం అప్పుడే రైతులకు నగదు చెల్లించేశారు. అంతకు మించి ధర పెట్టినవారు మాత్రం గడువుపెట్టి తీసుకున్నారు. అయితే ఇంతవరకు వారి నుంచి నగదు అందలేదు. అదేమంటే తమకే ప్రభుత్వం నుంచి రాలేదని అంటున్నారని రైతులు వాపోతున్నారు.  


నగదు అందక అప్పులు

70.5 క్వింటాళ్ల తెల్లజొన్నలను మేలో రూ.2,550 చొప్పున ప్రభు త్వ కొనుగోలు కేంద్రంలో విక్ర యించాను.  ఇందుకు సంబంఽ దించి రూ.1,79,775 రా వాలి. ఐదు నెలలు అవుతున్నా నగదు జమ కాలేదు. ఖరీఫ్‌ సాగుకు ఆ నగదు అంద కపోవడంతో అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నా ను. పంట డబ్బు లు రాక.. అప్పులకు వడ్డీలు పెరిగి అల్లాడుతున్నాను. నగదు జమ గురించి ఎవరిని అడిగినా తెలియదనే సమాధానం మినహా ఫలితం ఉండటంలేదు. 

- పుల్లారెడ్డి, నరసాయపాలెం, బాపట్ల మండలం


Updated Date - 2020-09-23T14:24:25+05:30 IST