Abn logo
Sep 23 2021 @ 00:55AM

సారీ..సర్వర్‌ డౌన్‌ !

ఒంగోలులో సర్వర్‌ లేక వేచివున్న కార్డుదారులు

రేషన్‌షాపుల వద్ద గంటల తరబడి ఎదురుచూపులు

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం


ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 22 : జిల్లా లో రేషన్‌ పంపిణీకి సర్వర్‌ అడ్డంకిగా మారింది. మూడు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా రేషన్‌షా పుల వద్ద కార్డుదారులకు కేంద్రప్రభుత్వ కోటా కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈనెల 19న పంపిణీ ప్రారంభం కాగా ప్రతిరోజూ సర్వర్‌డౌన్‌ అవుతుండటంతో అటు కార్డుదారులు, వారికి సమాధానం చెప్పలేక ఇటు డీలర్లు ఇబ్బం దిపడుతున్నారు. సాధారణంగా సర్వర్‌ పనిచేస్తే రోజుకు 20 నుంచి 25శాతం మంది కార్డుదారుల కు రేషన్‌ పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. అ యితే బుధవారం సాయంత్రం ఐదున్నర గంట లకు జిల్లావ్యాప్తంగా 35శాతం మంది కార్డుదారు లకు మాత్రమే సరుకులు అందాయంటే సర్వర్‌ ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. సర్వర్‌ గంటపాటు బాగా పనిచేస్తే రెండు గంటలు మొ రాయిస్తోంది. దీంతో కార్డుదారులు రేషన్‌ షాపుల వద్దనే బియ్యం కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి  ఏర్పడింది.


గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఆధ్వానం


పట్టణ ప్రాంతంలో ఒకసారి కాకపోయినా మ రోసారి అయినా సర్వర్‌ ఒక విధంగా పనిచేస్తుం డగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరింత అధ్వా నంగా ఉంది. సర్వర్‌ ఎప్పుడు వస్తోందో, ఎప్పుడో డౌన్‌ అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెల కొంది. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్ర జానీకం గంటల తరబడి రేషన్‌  షాపుల వద్ద గుంపులు, గుంపులుగా ఉండాల్సి వస్తోంది. 


కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం


జిల్లాలో  సర్వర్‌ పడిపోతున్న విషయాన్ని పౌ రసరఫరాల శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం. రెండు నెలల నుంచి బాగానే పనిచేసింది. ఈ ప ర్యాయం గ్రామీణ ప్రాంతాల్లో సర్వర్‌ డౌన్‌ అవు తున్నట్లు డీలర్ల నుంచి కూడా ఫోన్లు వస్తు న్నాయి.  సమస్య పరిష్కారానికి అవసరమైన చ ర్యలు తీసుకుంటాం. 

- సురేష్‌, డీఎస్‌వో