జొహన్నెస్‌బర్గ్ టెస్ట్.. పట్టుబిగిస్తున్న భారత్

ABN , First Publish Date - 2022-01-04T21:45:24+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు

జొహన్నెస్‌బర్గ్ టెస్ట్.. పట్టుబిగిస్తున్న భారత్

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో  టీమిండియా  పట్టుబిగిస్తోంది. లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసి భారత్ కంటే 100 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు ఈ ఉదయం ఓవర్‌నైట్ స్కోరు 35/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 88 పరుగుల వద్ద  కెప్టెన్ డీన్ ఎల్గర్ (28) వికెట్‌ను కోల్పోయింది.


ఆ తర్వాత 101, 102 పరుగుల వద్ద వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకుని అర్ధ సెంచరీ చేసి జోరుమీదున్న కీగన్ పీటర్సన్ (62), డుసెన్ (1)లను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ పంపి సౌతాఫ్రికాను దారుణంగా దెబ్బతీశాడు. సఫారీ జట్టు కోల్పోయిన నాలుగు వికెట్లలో మూడు శార్దూల్‌కే దక్కాయి. కాగా, అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది.

Updated Date - 2022-01-04T21:45:24+05:30 IST