Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయానికి చేరువగా దక్షిణాఫ్రికా.. శ్రమిస్తున్న భారత బౌలర్లు

కేప్‌టౌన్: భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది. కెప్టెన్ డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ ఎలాంటి తొందరపాటు లేకుండా నిదానంగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపిస్తున్నారు. మరోవైపు, వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


23 పరుగుల వద్ద ఓపెనర్ మార్కరమ్ (16)ను షమీ పెవిలియన్ పంపాడు. అయితే, ఆ సంబరం ఎంతోసేపు నిలవలేదు. క్రీజలోకి వచ్చిన పీటర్సన్ కెప్టెన్ ఎల్గర్ అండగా దూకుడు మొదలుపెట్టాడు. ఇద్దరూ క్రీజులో పాతుకుపోయారు. ప్రస్తుతం సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 95 పరుగులు చేసి విజయానికి 117 పరుగుల దూరంలో ఉంది.


చేతిలో పుష్కలంగా వికెట్లు ఉండడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సౌతాఫ్రికా విజయాన్ని అడ్డుకోవడం కష్టమే. ఎల్గర్ 30, పీటర్సెన్ 42  పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా ఎదుట 212 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ఉంచింది. 

Advertisement
Advertisement