చండీగఢ్‌లో South Africa Returneeకి కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2021-11-30T13:10:21+05:30 IST

దక్షిణాఫ్రికా నుంచి చండీగఢ్‌ నగరానికి తిరిగి వచ్చిన 39 ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర పాలిత ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు....

చండీగఢ్‌లో South Africa Returneeకి కొవిడ్ పాజిటివ్

చండీగఢ్ (పంజాబ్): దక్షిణాఫ్రికా నుంచి చండీగఢ్‌ నగరానికి తిరిగి వచ్చిన 39 ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర పాలిత ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.కొవిడ్ సోకిన వ్యక్తి నవంబర్ 21న దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాడు. అతను దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్యశాఖ అధికారులు విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షను నిర్వహించగా, అతనికి నెగెటివ్ అని తేలింది.ఆ తర్వాత హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఏడు రోజుల తర్వాత మళ్లీ పరీక్షిస్తే సెక్టార్ 36లో నివాసం ఉంటున్న వ్యక్తికి కొవిడ్-19 సోకినట్లు గుర్తించారు.దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి స్నేహితులు ఇద్దరికి, ఒక కుటుంబ సభ్యుడు, పనివాడికి కూడా కరోనా వచ్చిందని పరీక్షల్లో తేలింది. 





అతని ఇతర కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా లేదని వెల్లడైంది. మరో కుటుంబ సభ్యుని పరీక్ష రిపోర్టు రావాల్సి ఉంది. క‌రోనా వైర‌స్‌ని వేరియెంట్ ను నిర్ధారించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ఆ వ్య‌క్తి శాంపిల్స్‌ను ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి)కి పంపారు.కరోనా ప్రోటోకాల్ ప్రకారం పాజిటివ్ కేసులను ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 

Updated Date - 2021-11-30T13:10:21+05:30 IST