సెల్ఫీలు, షేక్‌హ్యాండ్లు లేవు

ABN , First Publish Date - 2020-03-10T10:19:25+05:30 IST

టీమిండియాతో మూడు వన్డేల సిరీ్‌సలో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు సోమవారం ఇక్కడకు చేరుకుంది. అనంతరం.. తొలి మ్యాచ్‌ జరగనున్న ధర్మశాలకు ఆ

సెల్ఫీలు, షేక్‌హ్యాండ్లు లేవు

కరోనాతో పటిష్ఠ చర్యలు 

భారత్‌ చేరిన దక్షిణాఫ్రికా జట్టు 

న్యూఢిల్లీ: టీమిండియాతో మూడు వన్డేల సిరీ్‌సలో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు సోమవారం ఇక్కడకు చేరుకుంది. అనంతరం.. తొలి మ్యాచ్‌ జరగనున్న ధర్మశాలకు ఆ జట్టు వెళ్లిపోయింది. ఇక.. భారత్‌లో 45 మంది కరోనా వైరస్‌ బారిన పడడంతో తమ జట్టుకు సంబంధించి క్రికెట్‌ సౌతాఫ్రికా అని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.   క్వింటన్‌ డికాక్‌ సారథ్యంలోని 16 మంది సభ్యులకు పలు సూచనలు చేసింది. దాని ప్రకారం.. అభిమానుల వద్దకు క్రికెటర్లు వెళ్లరాదని సూచించింది. వారితో సెల్ఫీలను నిషేధించింది. మరోవైపు కరోనా కారణంగా తాము సంప్రదాయ కరచాలనానికి దూరంగా ఉంటామని దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌ మార్క్‌ బౌచర్‌ తెలిపాడు. ఇక.. ఈనెల 29న ప్రారంభమయ్యే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ కరొనా వైరస్‌ నివారణ చర్యలను కచ్చితంగా పాటిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. 

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్‌ డికాక్‌ (కెప్టెన్‌, కీపర్‌), బవుమా, డ్యూసెన్‌, డుప్లెసి, కైల్‌ వెరైయిన్‌, క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, స్మట్స్‌, ఫెలుక్వాయో, ఎంగిడి, లుథో సిపామ్లా, హెండ్రిక్స్‌, నోర్జ్‌, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌, యానెమన్‌ మేలన్‌.

Updated Date - 2020-03-10T10:19:25+05:30 IST