దక్షిణాఫ్రికాలో ఒక్కరోజులో Omicron variant కేసులు రెట్టింపు

ABN , First Publish Date - 2021-12-02T13:32:37+05:30 IST

దక్షిణాఫ్రికా దేశంలో ప్రబలిన కొవిడ్ కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ కేసుల సంఖ్య ఒక్కరోజులో రెట్టింపు అయింది....

దక్షిణాఫ్రికాలో ఒక్కరోజులో Omicron variant కేసులు రెట్టింపు

కేప్ టౌన్: దక్షిణాఫ్రికా దేశంలో ప్రబలిన కొవిడ్ కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ కేసుల సంఖ్య ఒక్కరోజులో రెట్టింపు అయింది. ఒమైక్రాన్ వేరియెంట్‌ను గుర్తించిన తర్వాత దక్షిణాఫ్రికాలో కొవిడ్ కొత్త వేరియెంట్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం దక్షిణాఫ్రికా దేశంలో 4,373 పాజిటివ్ కేసులుండగా బుధవారం ఒక్కరోజే వీటి సంఖ్య 8,561కి పెరిగింది. దక్షిణాఫ్రికాలో వారం రోజులు గడిచేకొద్దీ కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ కేసుల సంఖ్య రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగడం చూడబోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ వైరాలజిస్ట్ డాక్టర్ నిక్సీ గుమెడె-మోలెట్సీ చెప్పారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమైక్రాన్ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదలతో ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 


Updated Date - 2021-12-02T13:32:37+05:30 IST