దక్షిణ కోస్తా, సీమకు వర్ష సూచన

ABN , First Publish Date - 2021-11-26T09:19:26+05:30 IST

దక్షిణ కోస్తా, సీమకు వర్ష సూచన

దక్షిణ కోస్తా, సీమకు వర్ష సూచన

29న అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం

అమరావతి, విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): దక్షిణ శ్రీలంక పరిసరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. అయితే దీని ప్రభావంతో తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమ పైకి బలమైన తూర్పుగాలులు వీస్తున్నాయని, దీంతో శుక్ర, శనివారాల్లో ఆ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 28 నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలావుండగా ఈ నెల 29న దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి, రెండు రోజు ల్లో పశ్చిమవాయవ్యంగా పయనిస్తుందని పేర్కొంది.

Updated Date - 2021-11-26T09:19:26+05:30 IST