వెల్లింగ్టన్ టెస్ట్: స్వల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్.. ఆధిక్యం దిశగా కివీస్

ABN , First Publish Date - 2020-02-22T16:08:33+05:30 IST

బేసిన్ రిజర్వ్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ ఆధిక్యం దిశగా వెళుతోంది.

వెల్లింగ్టన్ టెస్ట్: స్వల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్.. ఆధిక్యం దిశగా కివీస్

వెల్లింగ్టన్: బేసిన్ రిజర్వ్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ ఆధిక్యం దిశగా వెళుతోంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 54 ఓవర్లలో మూడు వికెట్లకు 167 పరుగులు. మూడు వికెట్లు ఇషాంత్ శర్మ ఖాతాలో పడ్డాయి. ఓపెనర్లు టామ్ లాథమ్(11), టామ్ బ్లండల్(30)లతో పాటు రాస్ టేలర్(44)లను ఇషాంత్ అవుట్ చేశాడు. క్రీజులో కెప్టెన్ విలియమ్సన్, నికోలస్ ఉన్నారు.


అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ 165 పరుగులకే ముగిసింది. తొలి రోజు ఆటలో 122 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన కోహ్లీ సేన.. రెండో రోజు మరో 43 పరుగులు మాత్రమే జోడించగలిగింది. జట్టు స్కోర్ 132 పరుగుల దగ్గర వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్(19) రనౌట్ కాగా, సోథీ బౌలింగ్‌లో అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మరికాసేపటికి రహనే(46) కూడా పెవిలియన్ చేరాడు. సోథీ బౌలింగ్‌లోనే వాట్లింగ్ చేతికి చిక్కాడు. కొద్దిసేపు కివీస్ బౌలర్లకు మహమ్మద్ షమి(21) అడ్డుకట్ట వేసినా.. ఇషాంత్ శర్మ అవుట్ అవ్వగానే.. తర్వాత బంతికే షమి కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ బౌలర్లలో సౌథీ, జమిసన్ చెరో నాలుగు వికెట్లు తీసుకోగా... ట్రెంట్ బోల్ట్ ఒక వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2020-02-22T16:08:33+05:30 IST