Advertisement
Advertisement
Abn logo
Advertisement

దక్షిణ ప్రాంతీయ సదస్సు ప్రారంభం

తిరుపతి: తిరుపతిలో ఆదివారం నుంచి జరిగే దక్షిణ ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం రాత్రే తిరుపతి చేరుకున్నారు. ఆయనతోపాటు పుదుచ్చేరి సీఎం రంగస్వామి, తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రపుల్‌ ఖోడా పటేల్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ దేవేంద్రకుమార్‌ జోషి కూడా తిరుపతి చేరుకున్నారు. సదస్సు 3.47 గంటలకు మొదలై, సాయంత్రం 6.45 గంటలకు ముగియనుంది. రాత్రి 7.30కు ముఖ్యమంత్రి జగన్‌ సదస్సుకు హాజరైనవారికి విందు ఇస్తారు దక్షిణ ప్రాంతీయ సదస్సు నేపథ్యంలో శనివారం నుంచే తిరుపతి మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. వీవీఐపీల భద్రతకు మూడు వేల మంది పోలీసు బలగాలను నియమించారు. అయితే ముగ్గురు ముఖ్యమంత్రులు మినహా మిగిలిన వారు గైర్హాజరయ్యారు.


సమావేశ వివరాలు

తిరుపతి తాజ్ హోటల్‌లో ఈ రోజు 3 గంటల నుంచి సదరన్ జోనల్ సర్కిల్ కౌన్సిల్ సమావేశం 

మధ్యాహ్నం 3 :  కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన ప్రారంభం కానున్న జోనల్ కౌన్సిల్ సమావేశం

మధ్యాహ్నం 3.05 నుంచి 3.09 నిమిషాలు : ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వాగత ఉపన్యాసం

మధ్యాహ్నం 3.10 - 3.13 : లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ఉపన్యాసం

మధ్యాహ్నం 3.13 - 3.16 అడమాన్ నికోబార్ ద్విపం గవర్నర్ ప్రతినిధి ఉపన్యాసం

మధ్యాహ్నం 3.16 - 3.19 : పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఉపన్యాసం

మధ్యాహ్నం 3.19 - 3.22 : పుద్దుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ ఉపన్యాసం

మధ్యాహ్నం 3.22 - 3.27 : కర్నాటక ముఖ్యమంత్రి ఉపన్యాసం

మధ్యాహ్నం 3.27 - 3.32 : తమిళనాడు ముఖ్యమంత్రి ప్రతినిధి ఉపన్యాసం

మధ్యాహ్నం 3.32 - 3.37 : తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతినిధి, తెలంగాణ హోo మంత్రి ఉపన్యాసం

మధ్యాహ్నం 3.37 - 3.42 : కేరళ ముఖ్యమంత్రి ప్రతినిధి ఉపన్యాసం

మధ్యాహ్నం 3.42 - 3.47 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉపన్యాసం

మధ్యాహ్నం 3.47 - 3.52 :  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభ ఉపన్యాసం

మధ్యాహ్నం 3.52 - రాత్రి 6.45 వరకు : అజెండాలోని ఒక్కో అంశంపై చర్చ

రాత్రి 6.45 నుంచి  కేంద్ర హోం మంత్రి ముగింపు ఉపన్యాసం 

రాత్రి 7.30 నుంచి ఏపీ ముఖ్యమంత్రి ఇచ్చే విందులో అమిత్ షా, ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement