Advertisement
Advertisement
Abn logo
Advertisement

సౌత్‌జోన్‌ పోటీలకు వీఎస్‌యూ క్రీడాకారులు

నెల్లూరు(విద్య), డిసెంబరు 4 : గుంటూరులోని కెఎల్‌ఈఎఫ్‌ విశ్వవిద్యాలయంలో ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు జరిగే సౌత్‌జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయ బ్యాడ్మింటన్‌ పోటీలకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఉపకులపతి ఆచార్య జి.సుందరవల్లి తెలిపారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్‌ స్టేడియంలో యూనివర్శిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. ప్రతిభ చూపిన సీహెచ్‌.సాయిచందు, ఎఎల్‌.ఆదిత్యరెడ్డి, సీహెచ్‌.కార్తికేయ, బి.సుబ్రహ్మణ్యం, బి.మంజుతేజను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ అందించామని వీసీ తెలిపారు. శనివారం క్రీడాకారులకు క్రీడాదుస్తులను పంపిణీ చేసి సౌత్‌జోన్‌ పోటీల్లో సత్తా చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ ఎల్‌.విజయకృష్ణారెడ్డి, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఆర్‌కె.యతిరాజ్‌, క్యాంప్‌ ఇన్‌ఛార్జి ఎం.రవీంద్రబాబు, టీమ్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఎ.ప్రవీణ్‌కుమార్‌, డీఎస్‌ఏ బ్యాడ్మింటన్‌ కోచ్‌ జి.వెంకటేష్‌లు పాల్గొన్నారు.


Advertisement
Advertisement