సోయా దోశ

ABN , First Publish Date - 2021-01-23T18:48:27+05:30 IST

ఇడ్లీ రైస్‌ - రెండు కప్పులు, సోయా బీన్స్‌ - ఒక కప్పు, మినప్పప్పు - ఒకటిన్నర కప్పు, మెంతులు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత,

సోయా దోశ

కావలసినవి: ఇడ్లీ రైస్‌ - రెండు కప్పులు, సోయా బీన్స్‌ - ఒక కప్పు, మినప్పప్పు - ఒకటిన్నర కప్పు, మెంతులు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నెయ్యి - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా సోయా బీన్స్‌ను ఒక పాత్రలో నానబెట్టుకోవాలి. మరొక పాత్రలో మినప్పప్పు, మెంతులు, సెనగపప్పు నానబెట్టాలి. ఇంకో పాత్రలో ఇడ్లీ రైస్‌ నాన బెట్టాలి. బాగా నానిన మినప్పప్పు, మెంతులను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత బియ్యం గ్రైండ్‌ చేసుకుని పాత్రలోకి తీసుకోవాలి. అలాగే సోయాబీన్స్‌ను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి తయారు చేసి పెట్టుకుని, ఉదయం దోశలు పోసుకుంటే బాగా వస్తాయి. స్టవ్‌పై పెనం పెట్టి దోశలు పోసి నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. దోశలు పలుచగా కాకుండా మందంగా పోసుకోవాలి. రెండు వైపులా కాల్చుకుని సర్వ్‌ చేసుకోవాలి. ఈ దోశ పిండి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటుంది.


Updated Date - 2021-01-23T18:48:27+05:30 IST