వచ్చి వెళ్లిన గంధర్వ లోకవాసీ

ABN , First Publish Date - 2020-09-26T06:13:02+05:30 IST

ఎవరైనా పోతే ఏడ్వడం రాదు ఈసారెందుకో ఏడుపు ఆగడం లేదు భావాలు బరువై మాట మూగపోయింది....

వచ్చి వెళ్లిన గంధర్వ లోకవాసీ

ఎవరైనా పోతే ఏడ్వడం రాదు

ఈసారెందుకో ఏడుపు ఆగడం లేదు

భావాలు బరువై మాట మూగపోయింది

బుర్రలోని గ్రామ్‌ఫోన్ ఒక్కసారిగా ఆగింది

అలసిన మనసుకు సాంత్వన నీ స్వరం

ఉరుకుల జీవితాలలో ఊరట నీ పాట

ఎంతో మంది మహానుభావులచే

పాడింపబడిన నీది అదృష్టమైతే

నీచే పలికించబడిన భాషదీ అదృష్టము

నీ గళం నుంచి చిలికిన భాషా పాటా 

వినిపించబడిన మాదీ అదృష్టము


-రూప

Updated Date - 2020-09-26T06:13:02+05:30 IST