‘ఎస్పీ బాలు మరణం తీరనిలోటు’

ABN , First Publish Date - 2020-09-26T09:16:46+05:30 IST

ఐదున్నర దశాబ్దాల పాటు తన మధురగానంతో సంగీత ప్రియులను ఓలలాడించిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

‘ఎస్పీ బాలు మరణం తీరనిలోటు’

సామర్లకోట, సెప్టెంబరు 25: ఐదున్నర దశాబ్దాల పాటు తన మధురగానంతో సంగీత ప్రియులను ఓలలాడించిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం యావత్‌ సంగీత లోకానికి తీరనిలోటని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ సుమారు 14 భాషల్లో 40 వేలకు పైగా బాలు పాటలు పాడారన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబానికి రాజప్ప ప్రగాఢ సానుభూతి తెలిపారు.


కంచి మహా సంస్థానంతో అనుబంధం

సామర్లకోటలోని కంచి మహా సంస్థానంతో ఎస్పీ బాలుకు అనుబంధం ఉండటం విశేషం. మహా సంస్థానం అధ్యక్షుడు  దివంగత చంద్రాభట్ల చింతామణి గణపతి శాస్ర్తి కుటుంబంతో బాలుకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా సామర్లకోటకు 3 దఫాలు వచ్చారు. సంస్థానంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొనడమే కాక హనుమజ్జయంతి పురస్కరించుకుని ప్రత్యేక కచేరీ నిర్వహించారు. తన కుటుంబం, గణపతి శాస్ర్తి కుటుంబానికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని... సామర్లకోట ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాలు, గురువు గణపతిశాస్త్రి గుర్తుకు రాక మానరని నాటి సభలో ఆయన పేర్కొనడం విశేషం.


బాలు మరణం తమ కుసామర్లకోటలో ఘన నివాళి

సామర్లకోట రింగ్‌ సెంటర్‌ బాలు అభిమానులు...సామర్లకోట, పెద్దాపురం పట్టణాల ఆర్కెస్ట్రాల అసోసియేషన్‌ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఏసుబాబు, కళాకారులు బడుగుసీతా రామ్‌, గిడుతూరి శ్రీనువాసు, చీమలకొండ వీరభద్రప్రసాద్‌, కొర్లమండ వీరభద్రరావు, శ్రీవాణి, బి.రామారావు, గిడుతూరి వెంకట్‌, కె.పరమేశ్వరరావు, మద్దాల శ్రీనివాసు, మేకా శ్రీనివాసు, ఆర్‌.సుదర్శన్‌, అందుగుల జార్జిచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


గర్వించదగ్గ గాయకుడు 

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ): భారతీయ సినీరంగం గర్వించదగ్గ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడతో బాలసుబ్రహ్మణ్యానికి ఎనలేని అనుబంధం ఉందని, ఆయన అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని కొండంబాబు బాలు మృతికి సంతాపం తెలిపారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా కళారంగంలో ఎంతో కృషి చేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో, ఇతర భాషల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌లో బాలు తన గాత్రంతో అభిమానులను ఉర్రూతలూగించారన్నారు. 


కళాకారుల సంతాపం

కొత్తపల్లి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి కొత్తపల్ల మండల కళాకారులు సంతాపం తెలిపారు. వివిధ భాషల్లో తన సుమధుర స్వరంతో సుమారు 40వేల పాటలు పాడిన ఎస్పీ బాలు మృతి చలన చిత్రరంగానికి తీరనిలోటని పలువురు పేర్కొన్నారు. రేడియా అండ్‌టీవీ గాయకుడు దాసరి సత్యనారాయణ, యూత్‌ హిస్ట్రియానిక్స్‌ అధినేత ఎంవీ చలపతిరావు, చలన చిత్రనటులు డాక్టర్‌  దున్నహరినాధ్‌రాజా, బత్తుల ప్రకాష్‌, పేరూరి కామేశ్వరరావు, క్యారెక్టర్‌ ఆర్టిస్టు పమ్మిన సీతారామ్‌, ఏఐసీసీ సభ్యుడు ఓలేటి రాయభాస్కరరావు బాలు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.


వరుపుల, కొమ్ముల సంతాపం

ప్రత్తిపాడు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంపై ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్ముల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. వేల పాటలు పాడి విశ్వవిఖ్యాత గాన గంధర్వుడిగా పద్మశ్రీ వంటి అనేక అవార్డులు పొందిన బాలు మరణం భారత చిత్రసీమకు తీరనిలోటని వారు పేర్కొన్నారు.టుంబాన్ని తీవ్రంగా కలచి వేసిందని గణపతిశాస్ర్తి సోదరుడు పతంజలి పేర్కొన్నారు. బాలు కుటు ంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-26T09:16:46+05:30 IST