Abn logo
Aug 15 2020 @ 18:32PM

నాన్నగారు కోలుకుంటున్నారు: ఎస్.పి. చరణ్

కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. అయితే ఉన్నట్లుండి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. వెంటనే ఐసీయూకి తరలించి వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, సామాన్యులు అందరూ కోరుతూ.. ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కోలుకుంటున్నారని తెలిపారు ఎస్.పి. బాలు తనయుడు ఎస్.పి చరణ్. 


మీడియాతో మాట్లాడిన ఎస్.పి. చరణ్.. ఎవ్వరూ కంగారు పడవద్దని తెలిపారు. ‘‘చాలా మంది ఫోన్ చేసి నాన్నగారి ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. వెంటిలేటర్‌పై నిపుణులైన వైద్యుల సమక్షంలో చికిత్స జరుగుతుంది. చక్కగానే రెస్పాండ్ అవుతున్నారు. భయపడాల్సింది ఏమీ లేదు. ఆయన ఒకటి, రెండు రోజులలో నార్మల్ అయ్యి బయటికి వచ్చే పరిస్థితిలో లేరు. కానీ అతి త్వరలో ఆయన క్షేమంగా బయటికి వస్తారనే నమ్మకం ఉంది. మేమంతా అదే నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉంది. మళ్లీ నాన్నగారి ఆరోగ్యంపై అప్‌డేట్ రాగానే అందరికీ తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు..’’ అని ఎస్.పి. చరణ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు.

Advertisement
Advertisement
Advertisement