కర్ఫ్యూ అమల్లో రాజీలేదు

ABN , First Publish Date - 2021-05-06T06:50:04+05:30 IST

జిల్లా విజయవాడ నగర పరిధిలో కర్ఫ్యూ పాక్షికంగా ఉంటుందని యం త్రాంగం ప్రకటించినప్పటికీ ప్రజల్లో ఇంకా కొన్ని సం దేహాలు ఉండిపోయాయి.

కర్ఫ్యూ అమల్లో రాజీలేదు

కారణం సహేతుకమైతే ఓకే!

‘ఆంధ్రజ్యోతి’తో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

ఆంధ్రజ్యోతి - విజయవాడ : జిల్లా విజయవాడ నగర పరిధిలో కర్ఫ్యూ పాక్షికంగా ఉంటుందని యం త్రాంగం ప్రకటించినప్పటికీ ప్రజల్లో ఇంకా కొన్ని సం దేహాలు ఉండిపోయాయి. వాటికి సమాధానాలు క్షేత్ర స్థాయిలో లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో కర్ఫ్యూ అమలు తీరుతోపాటు, 12గంటల ముందు, తర్వాత పరిస్థితులు, కర్ఫ్యూ నుంచి ఎవరికి మినహాయింలు అనే విషయాలపై విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రాజేంద్రనాథ్‌బాబు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు మీ కోసం..

ప్ర : మధ్యాహ్నం 12 గంటలకు ముందు, తర్వాత పోలీసింగ్‌ ఎలా ఉండబోతుంది?

జ : ఇబ్బంది ఉండదు. అనుమతించిన సమయంలో పనులు పూర్తి చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 తర్వాత రహదారులు మూసేస్తున్నాం. అత్యవసర సేవలు అనుమతిస్తాం. 

ప్ర : సడలింపులు ఎవరెవరికి ?

జ : ప్రభుత్వం విడుదల జాబితా ప్రకారం ఉంటుం ది. అలాగే అప్పటికప్పుడే ఏర్పడే పరిస్థితిని బట్టి అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటారు. 

ప్ర : మందులకోసం వెళ్లేవారికి?

జ : వైద్యుల ప్రిస్కిప్షన్‌ చూపించి రావచ్చు.  

ప్ర : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులకుతేడా ఉంటుంది కదా?

జ : వాస్తవమే. గ్రామాల్లో ఎక్కువగా కూలీలు పనికి వెళ్తుంటారు. వీరికి ఇబ్బందులు ఉండవు. దీనిపై పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. 

ప్ర : షిఫ్టులప్రకారం వెళ్లే ఉద్యోగులకు పరిస్థితి ఏంటి? 

జ : జగ్గయ్యపేట, జంక్షన్‌ ప్రాంతాల్లో పరిశ్రమలుంటే, కృత్తివెన్ను, గుడివాడ, కైకలూరు, అవనిగడ్డ ప్రాం తాల్లో హెచరీలున్నాయి. ఆయా యాజమాన్యాల తో మాట్లాడాం. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని అందులో వెళ్లాలని సూచించాం. అందుకు వారంతా అంగీకరించారు.

‘ఆన్‌లైన్‌’ ఆహారానికి అనుమతి

విజయవాడ సీపీ  బత్తిన శ్రీనివాసులు

ప్ర : ఆన్‌లైన్‌ సేవలకు కర్ఫ్యూ మినహాయింపు ఉందా?

జ : 24/7 పనిచేసేవారితోపాటు వ్యవసాయ పనులకు ఉంది. ఆన్‌లైన్‌ సేవలను అనుమతిస్తున్నాం. స్విగ్గీ, జుమోటో వారిని మేం అడ్డుకోం.

ప్ర : నగరంలో రద్దీ పెరుగుతుంది కదా!

జ : ఉన్న సమయంలోనే ప్రజలు ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసుకోవాలి. హడావుడి పడొద్దు. పోలీసులకు సహకరించాలి. 

ప్ర : వాణిజ్య సముదాయాలను ఒకేసారి మూసేయడం వల్ల ఇళ్లకు వెళ్లేవారికి ఇబ్బంది కదా!

జ : వాణిజ్య సముదాయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందేమీ లేదు. మరో అరగంట వరకు సమయం ఇస్తున్నాం. గుర్తింపు కార్డులను వెంట పెట్టుకోవడం మంచిది.   

ప్ర : శుభకార్యాలకు వెళ్లే వారిని అనుమతిస్తారా?

జ : రెవెన్యూ అధికారుల అనుమతిలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అతిథులు సంఖ్య 20లోపే ఉండాలి. వివరాలిస్తే అధికారులు పాస్‌లు ఇస్తారు. పోలీసులకు చూపిస్తే సరిపోతుంది.

ప్ర : దూరప్రాంతాలకు వెళ్లేవారిని అనుమతిస్తారా?

జ : రైల్వేస్టేషన్‌, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు సడలింపు ఉంది. ఎక్కడైనా పోలీసులు ఆపినప్పడు సంబంధిత మెసేజ్‌ లేదా టికెట్‌ చూపిస్తే సరిపోతుంది. 

Updated Date - 2021-05-06T06:50:04+05:30 IST