Abn logo
Sep 27 2021 @ 23:21PM

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు : ఎస్పీ

అర్జీలను స్వీకరిస్తున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు క్రైం, సెప్టెంబరు 27: ప్రజా సమస్యల పరిష్కా రానికి తక్షణ చర్యలు తీసుకుం టామని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. జిల్లా పోలీసు కార్యా లయ సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్ర మంలో అర్జీలు స్వీకరించారు. ఈ ఫిర్యాదులపై చర్యలు తీసు కుని బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఉండ్రాజవరం మండలానికి చెందిన మహిళ తన మరదలు ఆమె తండ్రి తన ఇంటికి తాళం వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చర్యలు తీసుకో వాలని కోరింది. మరో మహిళ తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ప్రమాదానికి కారణమైన వాహనదారుడిపై ఉండ్రాజవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేస్తే కేసు నమోదు చేశారని ఇంతవరకు చర్యలు తీసుకోలేదని నిందితుల ను అరెస్టు చేయలేదని న్యాయం చేయాలని కోరింది. ఏలూరు త్రీ టౌన్‌ పరిధిలో నివాసముంటున్న మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ఇంట్లో కొంతకాలం క్రితం దొంగతనం జరిగిందని, బంగారు నగలు అపహరించుకుపోయారంది. త్రి టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారని ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని చర్యలు తీసుకోవాలని కోరింది. 


అనుమతులు లేకుండా బాణా సంచా తయారు చేసినా నిల్వలు ఉంచినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. బాణ సంచా అక్రమంగా తయారుచేసే వారి వివరాలు తెలిస్తే డయల్‌ 100, ఎస్పీ వా ట్సాప్‌ నెంబర్‌ 9550351100కు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యం గా ఉంచుతామని ఎస్పీ అన్నారు. ఎస్‌బి సీఐ కొండరాలవు తదితరులు పాల్గొన్నారు.