Abn logo
Sep 23 2021 @ 00:32AM

నేరాల నియంత్రణపై అప్రమత్తంగా ఉండండి

 జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

అనంతపురం క్రైం, సెప్టెంబరు 22: జిల్లాలో మహిళలపై నేరాలు జరగకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప అదేశించారు. బుధవారం ఆయన తన చాం బర్‌ నుంచి అనంతపురం సబ్‌ డివిజన పరిధిలోని పోలీసు అధికారులతో జూమ్‌ వీడియో కా న్ఫరెన్సు ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయా ప్రాంతాల వారీగా కేసుల పరిస్థితి.. పురోగతి తదితర ఆంశాలపై ఆరా తీసి మాట్లాడారు. దీర్ఘకాలిక పెండి ంగ్‌ కేసుల పరిష్కారంపై దృష్టిసారించాలన్నారు. జిల్లాలో మట్కా, గుట్కా, పేకాట, క్రి కెట్‌ బెట్టింగ్‌ తదితర అసాంఘిక కార్యకలాపాలు జరగ కుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశా రు. ఇసుక, మద్యం అక్రమ రవాణా జరగకుండా ఆయా ప్రాంతాల చెక్‌ పోస్టులను అప్రమత్తం చేయడంతో పా టు నిత్యం నిఘా ఉంచాలన్నారు. దొంగతనాలు, దోపిడీ లు తదితర నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కేసులను సాంకేతిక పరిజ్ఞానంతో త్వరగా  పరిష్కరించాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ లో ప్రతి పోలీసు నిజాయతీగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.