సమాజ్‌వాదీ పార్టీ కైరానా అభ్యర్థి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-15T23:58:01+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ కైరానా అభ్యర్థిగా..

సమాజ్‌వాదీ పార్టీ కైరానా అభ్యర్థి అరెస్టు

లక్నో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ కైరానా అభ్యర్థిగా ప్రకటించిన నహిద్ హసన్‌ను గ్యాంగ్‌స్టర్ చట్టం కింద యుపీ పోలీసులు అరెస్టు చేశారు. కైరానా ఎమ్మెల్యేగా కూడా హసన్ ఉన్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద యూపీ పోలీసులు ఆయనను శనివారంనాడు అరెస్టు చేసి సిటీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రెండ్రోజుల క్రితమే కైరనా నియోజకవర్గం అభ్యర్థిగా ఆయన పేరును సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. 2021 ఫిబ్రవరిలో హసన్, ఆయన తల్లితో సహా 40 మందిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-01-15T23:58:01+05:30 IST