నకిలీ ఏజెంట్లపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-10-19T05:14:39+05:30 IST

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామ ని నమ్మబలికే వారి మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సూచించారు.

నకిలీ ఏజెంట్లపై అప్రమత్తంగా ఉండాలి
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

 ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు క్రైం, అక్టోబరు 18: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామ ని నమ్మబలికే వారి మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ఏలూరు లోని జిల్లా పోలీస్‌ కార్యాలయం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మాట్లాడుతూ విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకునే వారు ఏజెంట్ల పూర్తి సమాచారం తెలుసుకోవాని సూచించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసగించే నకిలీ ఏజెంట్ల సమాచారాన్ని పోలీసులకు అందించాలని, సమాచారం ఇచ్చినవారి వివ రాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. స్పందన కార్యక్రమంలో ఉండ్రాజవరం నుంచి ఒక మహిళ వచ్చి తన భర్తపై పెట్టిన కేసును రాజీ చేసుకోవాలని ఒక వ్యక్తి అసభ్యకరమైన మెస్సేజ్‌లు చేస్తున్నాడని ఫిర్యాదు ఇచ్చింది. ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక మహిళ వచ్చి వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కొవ్వూరు నుంచి ఒక మహిళ వచ్చి మహరాజ కనస్ట్రక్షన్స్‌ యాజమాన్యం వారికి చేసిన ఒక పని కాలానికి 26 లక్షల 85 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా బెదిరింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఒక వృద్ద మహిళ వచ్చి తన కొడుకు, కోడలు ఆస్తి కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. 


Updated Date - 2021-10-19T05:14:39+05:30 IST