క్షతగాత్రులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించాలి

ABN , First Publish Date - 2020-10-24T11:50:14+05:30 IST

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షత గాత్రులను త్వరితగతిన ఆస్పత్రులకు తరలించాలని తద్వారా వారి ప్రాణాలను కాపాడి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని ..

క్షతగాత్రులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించాలి

ఎస్పీ కె.నారాయణ నాయక్‌ 


 ఏలూరు క్రైం, అక్టోబరు 23: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షత గాత్రులను త్వరితగతిన ఆస్పత్రులకు తరలించాలని తద్వారా వారి ప్రాణాలను కాపాడి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ రోడ్డు సేఫ్టీ మొబైల్‌ వాహనాలకు సంబం ధించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. జాతీయ రహ దారిలో జిల్లాకు చెందిన 13 రోడ్డు సేఫ్టీ మొబైల్‌, 4 గెట్‌వే వాహనాల ఇన్‌ఛార్జ్‌లు, సిబ్బందితో ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంబం ధిత వాహనాల్లో సిబ్బంది 24 గంటలూ తమకు కేటా యించిన ప్రాంతాల్లో జాతీయ రహదారిపై నిరంతరం  గస్తీ నిర్వహించాలన్నారు. రాత్రి సమయాల్లో వాహన దారులను ఆపి వాష్‌ అండ్‌ బ్రెయిన్‌ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలన్నారు. జాతీయ రహదారి వెంబడి దాబాలు రాత్రి సమయాల్లో నిర్ణీత సమయా నికి మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  అనం తరం రోడ్డు సేఫ్టీ వాహనాల సామర్థ్యాన్ని తెలుసుకు నేందుకు వాటిని తనిఖీ చేశారు. కార్యక్రమంలో అద నపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, డీసీఆర్‌బీ సీఐ కృష్ణారావు, జిల్లా ట్రాఫిక్‌ బ్యూరో ఎస్‌ఐ రాంబాబు, రోడ్డు సేఫ్టీ వాహన సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T11:50:14+05:30 IST