ఎస్పీలో కేవలం యాదవులకే టికెట్లు: ఎస్పీని వీడిన నేత

ABN , First Publish Date - 2022-01-21T22:18:53+05:30 IST

ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ కార్యదర్శిగా పని చేశాను. కానీ పార్టీలో నాలాంటి వారికి ప్రాధాన్యత ఉండదు. కేవలం యాదవులకు, వారి బంధువులకు మాత్రమే టికెట్లు, పదవులు ఇస్తారు. పూర్వ సైనికుడిని. సమాజ్‌వాదీ పార్టీ కోసం చాలా పని చేశాను. కానీ అఖిలేష్ నా మాట వినలేదు. కర్హల్ ప్రజలు నా మాట వింటారు..

ఎస్పీలో కేవలం యాదవులకే టికెట్లు: ఎస్పీని వీడిన నేత

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ యాదవుల పార్టీయని, ఆ పార్టీలో కేవలం యాదవులకే టికెట్లు ఇస్తారని ఎస్పీని వీడి బీజేపీలో చేరిన రఘుపాల్ సింగ్ ఆరోపించారు. కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తామని ప్రకటించగానే రఘుపాల్ పార్టీకి రాజీనామా చేశారు. కారణం, అది రఘుపాల్ స్థానం కావడం. బీజేపీలో చేరిన అనంతరమే అఖిలేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


‘‘ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ కార్యదర్శిగా పని చేశాను. కానీ పార్టీలో నాలాంటి వారికి ప్రాధాన్యత ఉండదు. కేవలం యాదవులకు, వారి బంధువులకు మాత్రమే టికెట్లు, పదవులు ఇస్తారు. పూర్వ సైనికుడిని. సమాజ్‌వాదీ పార్టీ కోసం చాలా పని చేశాను. కానీ అఖిలేష్ నా మాట వినలేదు. కర్హల్ ప్రజలు నా మాట వింటారు. వారు నాతోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేస్తాను’’ అని అన్నారు.


కాగా, అఖిలేష్ యాదవ్ మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే అజాంగఢ్ నుంచి పోటీ చేయనున్నట్లు మొదట అనుకున్నప్పటికీ కర్హల్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2022-01-21T22:18:53+05:30 IST