నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-04-21T06:53:49+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు కచ్చి తంగా అమలు జరపాలని జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ రవీంద్ర నాథ్‌బాబు ఆదేశించారు.

నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

 పోలీసు యంత్రాంగానికి ఎస్పీ ఆదేశాలు

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 20 : జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు కచ్చి తంగా అమలు జరపాలని  జిల్లాలోని పోలీసు అధికారులను  ఎస్పీ రవీంద్ర నాథ్‌బాబు ఆదేశించారు. మంగళవారం ఎస్పీ సెట్‌, వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులు సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌  ఉధృతి గా ఉందన్నారు. పోలీసులు తమ ఆరోగ్యాన్ని కాపాడు కుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. ఏఎస్పీ మల్లికా గార్గ్‌, డీఎస్పీ రమేష్‌రెడ్డి  పాల్గొన్నారు. 

 మాస్కు లేకుంటే బస్సు ఎక్కనీయొద్దు 

  ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ బస్‌ స్టాండులోని గ్యారేజీలో మంగళవారం జరిగిన అవగా హన సదస్సులో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రయాణికులు గుమి గూడకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలన్నారు. ప్రయాణికులు చేతులు కడుక్కునేందుకు డిపోలో సబ్బులు ఏర్పాటు చేయాలన్నారు. బస్సు ఎక్కేముందు ప్రయాణికులు మాస్కులు ధరించారా లేదా అనే విషయాన్ని కండక్టర్లు, డ్రైవర్లు సునిశితంగా పరిశీలిం చాలన్నారు. మాస్కు లేకుండా వస్తే బస్సు ఎక్కనీయొద్దున్నారు.  ట్రాఫిక్‌ డిఎస్పీ మాసూం బాషా, డిఎస్పీ ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ బస్సులకు స్టిక్కర్లు అంటించారు. 

Updated Date - 2021-04-21T06:53:49+05:30 IST