మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు :ఎస్పీ

ABN , First Publish Date - 2020-07-14T10:31:17+05:30 IST

మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్య లు తీసుకోవాలని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో టెలీ స్పందన ..

మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు :ఎస్పీ

విజయనగరం క్రైం, జూలై 13: మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్య లు తీసుకోవాలని  ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో టెలీ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి, ఫోన్‌ ద్వారా ఫిర్యాదు లను స్వీకరించారు. తొలుత గరివిడి మండలం కుమరాం గ్రామానికి చెందిన ఎ.సతీష్‌ మాట్లాడుతూ.. చీపురుపల్లికి చెందిన ఓ వ్యక్తికి  రుణంగా ఇచ్చిన రూ.9 లక్షల 50 వేలు తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. తన చీటిపాట డబ్బులు ఇప్పించాలని విజయనగరానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తాను రుణంగా ఇచ్చిన రూ.5 లక్షలు తిరిగి ఇప్పించాల్సిందిగా   విజయనగరానికి చెందిన మరో మహిళ కోరింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష 20 వేలు తీసుకుని మోసగించారని పార్వతీపురానికి చెందిన ఆర్‌.మహేశ్వరరావు తెలిపారు. ఈ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి, తీసుకున్న చర్యలను నివేదించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.  

Updated Date - 2020-07-14T10:31:17+05:30 IST