Abn logo
Sep 21 2021 @ 17:13PM

కొప్పర్రు ఘటనపై స్పందించిన రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు: కొప్పర్రు ఘటనపై రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ స్పందించారు. కొప్పర్రు ఘటన బాద్యులను అరెస్టు చేశామని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. 16 మంది అనుమానితులను పెదనందిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా  విచారణ జరపాలని ఆదేశించామన్నారు. కొప్పర్రు కేసుకు సంబంధించి క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

క్రైమ్ మరిన్ని...