గ్రామీణ మహిళల సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-01-19T05:29:30+05:30 IST

గ్రామీణ మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు.

గ్రామీణ మహిళల సమస్యల పరిష్కారానికి చర్యలు
విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ

గణపవరం,జనవరి 18: గ్రామీణ మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. గణపవరం పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం విలేకరు లతో మాట్లాడారు. గ్రామాల్లో మహి ళల సమస్యలను మహిళా పోలీసులతో పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు. గణపవరం, చేబ్రోలులో ట్రాఫిక్‌ సమస్య ఉందన్నారు. సర్కిల్‌ పరిధిలో జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జిల్లాలో నేరాల రేటు తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రజలు చైతన్యవంతులై పోలీసు లకు సహకరిస్తే నేరాలను పూర్తిగా అదుపు చేయవచ్చన్నారు. సమావేశంలో సీఐ వీ.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ ఎం.వీరబాబు, పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:29:30+05:30 IST