Abn logo
Apr 9 2021 @ 01:45AM

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

నూజివీడు రూరల్‌, ఏప్రిల్‌ 8 : సిద్ధార్థనగర్‌లోని పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు గురువారం తనిఖీ చేశారు.  అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సుల భద్రత, స్ర్టాంగ్‌రూం వద్ద ఏర్పాట్లు తదితర అంశాలపై డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఇతర అధికారులతో మాట్లాడారు.  సీఐ వెంకటనారాయణ, ఎస్సై రంజిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కంచికచర్ల రూరల్‌ : గొట్టుముక్కల పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందోబస్తు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, నందిగామ రూరల్‌ సీఐ సతీష్‌, ఎస్సై రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

నందిగామ రూరల్‌ : పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు  గురువారం పరిశీలించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలైన చందాపురం, మాగల్లు, రామిరెడ్డిపల్లితో పాటు పలు గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, డీఎస్పీ నాగేశ్వర్‌ రెడ్డి, సీఐ కనకారావు, ఎస్సై తాతాచార్యులు పాల్గొన్నారు. 

చందర్లపాడు : పరిషత్‌ ఎన్నికల సందర్భంగా గురువారం జిల్లా ఎస్‌పీ రవీంద్రనాద్‌బాబు పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. మండలంలోని ముప్పాళ్ల గ్రామంలోని పలు బూత్‌ను పరిశీలించిన ఆ యన స్థానిక పోలీసులతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అ వాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఎ వరినీ ఉపేక్షించ వద్దని సిబ్బందికి సూచించారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ముప్పాళ్లలోని పలు బూత్‌ను పరిశీలించిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. చందర్లపాడులోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో మొండితోక జగన్మోహనరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Advertisement
Advertisement
Advertisement