దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు పటిష్ట భద్రత: ఎస్పీ

ABN , First Publish Date - 2021-01-21T06:42:23+05:30 IST

జిల్లాలోని దేవాల యాలు, ప్రార్థనా మందిరాలకు పటిష్ట భద్రతతో పాటు నిఘా విస్త్రృతం చేసినట్టు జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు పటిష్ట భద్రత: ఎస్పీ

అనంతపురం క్రైం, జనవరి 20: జిల్లాలోని దేవాల యాలు, ప్రార్థనా మందిరాలకు పటిష్ట భద్రతతో పాటు నిఘా విస్త్రృతం చేసినట్టు జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు  బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6661 దేవాలయాలు, ప్రార్థనా మందిరాలలో నిత్యం పోలీసుల నిఘాతో పాటు విలేజ్‌ డిఫెన్స్‌ కమిటీలచే భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. రాత్రి వేళ్లలో డీఎస్పీలు, సీఐ ల నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు చేసి సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 4వేల విలేజ్‌ డిఫెన్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి 721 ప్రాంతాల్లో 1852 సీసీ కెమెరాలతో పర్య వేక్షిస్తున్నామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా చోరీల కు పాల్పడేవారు, మత సామరస్యానికి భంగం కలిగించే వారు, గుప్తనిధుల వేటగాళ్లు తదితర వర్గాలకు చెందిన 3773మందిని బైండోవర్‌ చేసినట్టు తెలిపారు. 2456 మంది అనుమానాస్పద వ్యక్తులకు కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తినా, అనుమానాస్పద వ్యక్తు లు కనిపించినా తక్షణమే డయల్‌-100 ద్వారా పోలీసు లకు సమాచారం అందించాలని కోరారు. 


Updated Date - 2021-01-21T06:42:23+05:30 IST