Abn logo
Sep 19 2021 @ 10:29AM

మూడు రోజుల స్పేస్ ట్రిప్ పూర్తి: సురక్షితంగా భూమికి చేరిన స్పేస్ ఎక్స్!

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ప్రయివేటు అంతరిక్షయాన సంస్థ స్పేస్​ఎక్స్ నలుగురు యాత్రికులతో మూడు రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించి భూమికి సురక్షితంగా చేరుకుంది. స్పేస్ ఎక్స్ వాహక నౌక డ్రాగన్‌ ‘స్పేస్‌ క్యాప్సుల్‌’ అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో దిగింది. దీనిని స్పేస్‌ ఎక్స్‌ తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఈ అంతరిక్ష వాహకనౌకలో టీవీ నటి సియాన్ ప్రోక్టర్ (51), ఏరోస్పేస్‌ డేటా ఇంజినీర్ క్రిస్ సెంబ్రోస్కీ (42), సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌ వైద్యాధికారిణి హేలీ ఆర్సెనాక్స్ (29)‌,  జారెడ్ ఐజాక్‌మన్ (38)లు బుధవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పయనమయ్యారు. ‘ఇన్స్పిరేషన్-4’ పేరిట నిర్వహించిన ఈ మిషన్​లో భాగస్వాములైన వీరు 540 కిలో మీటర్ల ఎత్తులో మూడు రోజులు గడిపారు. స్పేస్ ఎక్స్ చేపట్టిన మొట్ట మొదటి ప్రయివేటు రైడ్ ఇదే.

ఇవి కూడా చదవండిImage Caption