స్పెయిన్‌ యువరాణి మృతి

ABN , First Publish Date - 2020-03-30T09:59:00+05:30 IST

నావెల్‌ కరోనా వైరస్‌ బారిన పడి తొలిసారి ఓ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. స్పెయిన్‌ రాజు ఫిలిప్‌ 6 బంధువు, యువరాణి మారియా థెరెసా(86) కొవిడ్‌-19 బారినపడి ఈ నెల 26న పారి్‌సలో కన్నుమూశారు.

స్పెయిన్‌ యువరాణి మృతి

  • వైరస్‌తో మారియా కన్నుమూత

న్యూఢిల్లీ, మార్చి 29: నావెల్‌ కరోనా వైరస్‌ బారిన పడి తొలిసారి ఓ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. స్పెయిన్‌ రాజు ఫిలిప్‌ 6 బంధువు, యువరాణి మారియా థెరెసా(86) కొవిడ్‌-19 బారినపడి ఈ నెల 26న పారి్‌సలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు ప్రిన్స్‌ సిక్స్టో ఎన్రిక్‌ డి బార్బన్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. మారియా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. తన సోదరి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. రాజు ఫిలిప్‌ 6కు కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన కొద్ది రోజులకే మారియా మృతి చెందడం గమనార్హం. ఆమె అంత్యక్రియలు శుక్రవారం పూర్తి చేశారు. ప్రపంచంలో ఓ రాజకుటుంబంలో తొలి కరోనా మరణం ఇదే.

Updated Date - 2020-03-30T09:59:00+05:30 IST