స్పందనకు 446 అర్జీలు

ABN , First Publish Date - 2021-12-07T05:16:57+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 446 అర్జీలు వచ్చాయి.

స్పందనకు 446 అర్జీలు
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌

భానుగుడి(కాకినాడ), డిసెంబరు 6: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 446 అర్జీలు వచ్చాయి.   కాకినాడ కలెక్టరేట్‌ స్పందన హాలులో సోమవారం జరిగిన  కార్యక్రమంలో కలెక్టర్‌ సి.హరికిరణ్‌, జాయింట్‌ కలెక్టర్లు సుమిత్‌కుమార్‌,  కీర్తి చేకూరి, ఎ.భార్గవ్‌తేజ, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌వీఎస్‌ సుబ్బలక్ష్మి తదితరులు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ స్పందనకు 446 అర్జీలు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులకు అందిస్తామన్నారు. ప్రాధాన్యక్రమంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. స్పందన అనంతరం అధికారులతో మాట్లాడిన కలెక్టర్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఓటీఎస్‌ కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలన్నారు. 

Updated Date - 2021-12-07T05:16:57+05:30 IST