ఐటీడీఏ స్పందనలో 52 అర్జీలు స్వీకరణ

ABN , First Publish Date - 2022-01-22T06:30:32+05:30 IST

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై 52 అర్జీలు అందినట్టు అధికారులు ప్రకటించారు.

ఐటీడీఏ స్పందనలో 52 అర్జీలు స్వీకరణ
స్పందనలో అర్జీదారులతో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌


వ్యవసాయ సంబంధ పరికరాలు మంజూరు చేయాలని పలువురు వినతి


పాడేరు, జనవరి 21: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై 52 అర్జీలు అందినట్టు అధికారులు ప్రకటించారు. ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ కొవిడ్‌ బారిన పడడంతో సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంజంగి పంచాయతీ బొర్రమామిడికి చెందిన కె.సుబ్బారావు, డి.గొందూరుకు చెందిన కూడా చిట్టిబాబు, జి.మాడుగుల మండలం ఈదులబయలుకు చెందిన జీలుగుల దేముళ్లు, తదితర తొమ్మిది మంది గిరిజన రైతులు, తమకు సోలార్‌ పంపు సెట్లు మంజూరు చేయాలని కోరారు. అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ  దిగువశోభ గ్రామానికి చెందిన గొంజోరి పెంటన్న, పాంగి ఆనందరావు.. పవర్‌ వీడర్ల కావాలని అర్జీలు సమర్పించారు. పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీ మర్రిదాటు గ్రామానికి చెందిన వి.శ్రీదేవి, వి.రాంబాబు తదితరులు తమ గ్రామానికి తాగునీటి పథకం మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ విభాగం ఈఈ డీవీఆర్‌ఎం.రాజు, హౌసింగ్‌ ఈఈ ఎస్‌.రఘుభూషణరావు, పంచాయతీరాజ్‌ ఈఈ కె.మాలకొండయ్య, పీఏవో బి.భాస్కరరావు, ిపీహెచ్‌వో సీహెచ్‌.బిందు, జీసీసీ డీఎం కె.పార్వతమ్మ, ఉపాధి హామీ పథకం ఏపీడీ జె.గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T06:30:32+05:30 IST