ఇనియన్‌కు స్పెయిన్‌ చెస్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2021-10-13T06:42:01+05:30 IST

భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ పి.ఇనియన్‌.. లా నూసియా ఓపెన్‌ చెస్‌ టోర్నీలో టైటిల్‌ గెలిచాడు. ..

ఇనియన్‌కు స్పెయిన్‌ చెస్‌ టైటిల్‌

లా నూసియా (స్పెయిన్‌): భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ పి.ఇనియన్‌..  లా నూసియా ఓపెన్‌ చెస్‌ టోర్నీలో టైటిల్‌ గెలిచాడు. తొమ్మిది రౌండ్ల ఈ టోర్నీలో 19 ఏళ్ల ఇనియన్‌ ఏడు పాయింట్లతో ఉక్రెయిన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ఆండ్రూ సుమెట్స్‌, రోడ్రిగో వాస్క్వెజ్‌ ష్రోడర్‌ (చిలీ)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే వీరిద్దరికంటే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఉన్న ఐదో సీడ్‌ ఇనియన్‌ ట్రోఫీ కైవసం చేసుకొన్నాడు. ఈ టోర్నీలో ఇనియన్‌ ఆరు గేమ్‌లు గెలిచి రెండు డ్రా చేసుకొన్నాడు. ఎనిమిదో రౌండ్‌లో బై లభించింది. 

Updated Date - 2021-10-13T06:42:01+05:30 IST