Abn logo
Sep 24 2021 @ 14:24PM

కొంపలు మునుగుతున్నా.. ఆ ఇల్లు మాత్రం...

స్పెయిన్ దేశంలోని కానరీ దీవుల్లోని లా పాల్మా అగ్నిపర్వతం పేలుడుతో వెలువడిన లావా సమీప ప్రాంతాలను ముంచెత్తుతోంది. స్పానిష్ కానరీ దీవుల్లో దాదాపు 50 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. ఈ లావా ప్రవాహం వల్ల సమీప ప్రాంతంలోని దాదాపు 200 ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు ఆరు వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.

లావా ప్రవహిస్తున్న తీరును డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ స్విమ్మింగ్‌పూల్‌ను ముంచెత్తుతున్న లావా వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. లావా ప్రవాహానికి ఇళ్లన్నీ ధ్వంసమవుతున్నా.. ఓ ఇల్లు మాత్రం కనీసం చెక్కుచెదరకుండా ఉన్న ఫొటో తాజాగా బయటకు వచ్చింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు `మిరాకిల్ హౌస్` అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...