Advertisement
Advertisement
Abn logo
Advertisement

గర్భిణులు పారసిటమాల్‌ వాడితే.. పిల్లలకు ఆటిజం! : స్పెయిన్‌ శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌, జూన్‌ 5: గర్భిణులు పారసిటమాల్‌ మాత్రలను వాడితే, వారికి పుట్టే పిల్లల ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుందా ? అనేది తెలుసుకునేందుకు స్పెయిన్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఇందులో భాగంగా ఆరు ఐరోపా దేశాలకు చెందిన 70వేల మందికిపైగా పిల్లల ఆరోగ్య నివేదికలను సేకరించి విశ్లేషించారు. కొందరు గర్భిణులు పారసిటమాల్‌ను వాడిన కారణం గా.. వారికి పుట్టిన పిల్లల్లో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ)ను గుర్తించినట్లు తెలిపారు. ఆటిజం స్పెక్ట్రమ్‌ కండిషన్స్‌ (ఏఎ్‌ససీ) అనే సమస్య ఇంకొందరు పిల్లల్లో  తలెత్తిందన్నారు. 

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...