Abn logo
Oct 27 2021 @ 20:29PM

ఒక్కొక్కరికి రూ. 7.5లక్షల బోనస్.. America లో లేడీ బాస్ సర్​ప్రైజ్​‌తో ఆనందంలో ఉద్యోగులు..

రూ.7.5లక్షలు బోనస్, రెండు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు

వాషింగ్టన్: వ్యాపారంలో లాభాలు వస్తేనో లేక ఏదైనా కీలక ఒప్పందం జరిగితేనో కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్​లు ఇస్తుంటాయి. బోనస్‌గా ఎంతో కొంత నగదు గానీ వాహనాలు, ఇతర వాటిని గిఫ్ట్‌లుగా ఇవ్వడం చేస్తుంటాయి. కానీ అమెరికాకు చెందిన సారా బ్లేక్లీ అనే వ్యాపారవేత్త తన ఉద్యోగులకు ఓ బంపరాఫర్‌తో సర్​ప్రైజ్​‌ చేశారు. ఒక్కో ఉద్యోగికి రూ.7.5 లక్షల బోనస్ ఇచ్చారు. అంతేగాక ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి వచ్చేందుకు రెండు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. స్పానె​క్స్ కంపెనీ యజమానురాలు అయిన సారా సర్​ప్రైజ్​‌తో ఆ కంపెనీ ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఈ సందర్భంగా సారా బ్లేక్లీ మాట్లాడుతూ.. "ఈ క్షణాలను ఆస్వాదించేందుకు నేను మీకు ఈ ఆఫర్​ ఇస్తున్నాను. ఇందుకోసం ప్రతి ఉద్యోగికి రెండు చొప్పున ఫస్ట్​క్లాస్​ విమాన టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ట్రిప్​కు వెళ్తే మంచి హోటల్​లో బస చేయడంతో పాటు మంచి డిన్నర్​ చేయాలి కనుక ఆ ఖర్చుల కోసం మరో రూ. 7.5 లక్షలు ఇస్తున్నాను. ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని వారి జీవితంలో ఎన్నటికీ మరచిపోలేనిదిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను' అని తెలిపారు.

అటు లేడీ బాస్ బంపరాఫర్‌తో ఉద్యోగుల సంతోషానికి అవధుల్లేవు. మేడం ఇచ్చిన ఈ టికెట్లు, డబ్బుతో తాము ప్రపంచాన్ని చుట్టేస్తామంటూ ఆనందంలో విహరిస్తున్నారు. ఇంతకీ సారా బ్లేక్లీ తన సంస్థలోని ఉద్యోగులపై ఈ వరాల వర్షం కురిపించడానికి మంచి కారణమే ఉంది. సారాకి చెందిన స్పానె​క్స్ సంస్థకు బ్లాక్​స్టోన్​ అనే మరో కంపెనీతో భారీ వ్యాపార ఒప్పందం కుదురడమే. స్పానె​క్స్‌లో మెజార్టీ వాటాను బ్లాక్​స్టోన్ కొనుగోలు చేయనుందట. ఈ ఒప్పందం విలువ 1.2 బిలియన్​ డాలర్లు(మన కరెన్సీలో సుమారు రూ.8.93 వేల కోట్లు). అందుకే ఆ సంస్థలోని ఉద్యోగులను సారా బ్లేక్లీ బంపరాఫర్స్‌తో ముంచెత్తారు. ఇక ఉద్యోగులు సారాను మేడం.. మీరు మేడం అంతే.. అంటూ పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...