‘వారి అక్రమాలు బయటపెట్టినందుకే సస్పెండ్ చేశారు’

ABN , First Publish Date - 2020-02-23T01:19:49+05:30 IST

ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్ సంస్థల్లో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఎస్పీడీసీఎల్ ఏడీఈ కోటేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆయన.. రఘుమారెడ్డి అవినీతిని ఫేస్‌బుక్

‘వారి అక్రమాలు బయటపెట్టినందుకే సస్పెండ్ చేశారు’

హైదరాబాద్: ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్ సంస్థల్లో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఎస్పీడీసీఎల్ ఏడీఈ కోటేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆయన.. రఘుమారెడ్డి అవినీతిని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా బయటపెట్టినందుకే తనను సస్పెండ్ చేశారని అన్నారు. తాను ఫేస్‌బుక్ లైవ్ కోసం పర్మిషన్ లెటర్ పెట్టానని కోటేశ్వరరావు తెలిపారు. కవర్ కండక్టర్స్‌కు సంబంధించిన ఫైల్స్ బయటపెడితే తాను సస్పెన్షన్‌లో ఉంటానని, ఉద్యోగంలో చేరనని సవాల్ విసిరారు. కవర్ కండక్టర్‌లో అక్రమాల వల్ల ఏపీలో దొర రాజీనామా కూడా చేశారని కోటేశ్వరరావు పేర్కొన్నారు. రఘుమారెడ్డి కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో సబ్‌స్టేషన్‌ల నిర్మాణాలకు కమలాకర్ రెడ్డికి ఏ బేస్ మీద కాంట్రాక్ట్ అప్పగించారని ఆరోపించారు. టెండర్ పిలువకుండా కాంట్రాక్టులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ అక్రమాలపై సీఎంకి చాలా సార్లు లేఖ కూడా రాసినట్లు కోటేశ్వరరావు తెలిపారు. ఇలాంటి భారీ కుంభకోణాలపై సీఎం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

Updated Date - 2020-02-23T01:19:49+05:30 IST